Crime |హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డులో యువకుడిపై కత్తితో హత్యాయత్నం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర ఓ యువకుడిపై రౌడిషీటర్ కత్తితో దాడికి చేసిన ఘటన కలకలం సృష్టించింది.

విధాత, హైదరాబాద్ :

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర ఓ యువకుడిపై రౌడిషీటర్ కత్తితో దాడికి చేసిన ఘటన కలకలం సృష్టించింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డులో రోషన్ అనే యువకుడిపై బాలేశ్వర్ రెడ్డి అనే రౌడీ షీటర్.. మరో వ్యక్తితో కలిసి కత్తితో పలుమార్లు పొడిచాడు. బాధితుడు వద్దు వద్దు అని బతిమిలాడిని దుండగుడు వినలేదు. ఎలాగోఅలాగా రౌడీ షీటర్ నుంచి యువకుడు తప్పించుకుని పారిపోయాడు.

అనంతరం బాలేశ్వర్ రెడ్డి అతని వెంట వచ్చిన మరో ఇద్దరు దుండగులతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. తీవ్ర గాయాల పాలైన రోషన్ ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్నాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలోనే గొడవ కారణంగా హత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.