Site icon vidhaatha

Nagarjunasagar: కత్తితో దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు..  

విధాత: నాగార్జునసాగర్ పైలాన్ కాలనీకి చెందిన మేదరి గోపాల్ పై కండల సైదులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గోపాల్ కు సంబంధించిన పందులను మిర్యాలగూడ కు చెందిన కండల అజయ్ అపహరించుకొని వెళ్తుండగా గోపాల్ అడ్డగించాడు. దీంతో సైదులు తన వద్ద ఉన్న కత్తితో గోపాల్ పై దాడి చేశాడు.

గాయపడిన గోపాల్ ను హిల్ కాలనీ కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version