Bomb threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

Due To Us Governmnet Shutdown air controller shortage and flight delays

విధాత, హైదరాబాద్ : 

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఈ పేలుడుకు ముందు స్లీపర్ సెల్ ఆపరేషన్ ను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఎప్పుడు, ఎక్కడ ఏం జరుగుతుందోననే ఆందోళన వ్యక్తం అవుతున్న సమయంలో దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపాయి. శంషాబాద్ ఏయిర్ పోర్ట్ సహా 5 విమానాశ్రయాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం పేల్చేస్తామని బుధవారం బెదిరింపు మెయిల్ పంపించినట్లు సమాచారం. అదే సమయంలో, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఆఫీస్కి కూడా “విమానాశ్రయం పేల్చేస్తాం” అనే హెచ్చరిక మెయిల్ వచ్చింది. ఈ ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధికారులు, హైదరాబాద్ లోని ప్రధాన షాపింగ్ మాల్స్, ప్రసిద్ధ టెంపుల్స్, బస్ స్టాప్స్, ఇతర జనసందర్శన ప్రాంతాల్లో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టింది.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నా వెంటనే స్వాధీనం చేసుకుంటున్నారు.

నగరవాసులు, ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు ప్రభుత్వం సూచించిన మార్గదర్వకాలను పాటించాలని భద్రత అధికారులో విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రయాణికులు ముందుగానే విమానాశ్రయాలకు రాకుండా, సాధారణ రవాణా, షాపింగ్, దేవాలయ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.