మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. వృత్తి పరంగా ఏర్పడే కొత్త పరిచయాలు రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉంటాయి. వ్యవహాత్మక నిర్ణయాలతో వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు తారాబలం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు తమ ఉద్యోగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రారంభించిన పనులు ఏకాగ్రతతో పూర్తి చేయడంపై దృష్టి సారించండి. ఆర్థిక వ్యవహారాల్లో అవగాహనతో నడుచుకుంటే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా నడుచుకోవాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వ్యాపారులు ఈ రోజు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలు కూడా సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెక్యూలేషన్లకు ఈ రోజు తగిన రోజు కాదు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదలతో ప్రయత్నిస్తే కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలు రాకుండా ఖర్చులు అదుపు చేయండి. జీవిత భాగస్వామితో ఘర్షణలు రాకుండా జాగ్రత్త వహించండి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీకు అనుకూల నిర్ణయాలు వెలువడుతాయి. అదృష్టయోగం ఉన్నందున విజయం మీ వెంటే వుంటుంది. అనేక మార్గాల నుంచి ధనలాభం పొందవచ్చు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబం సభ్యులతో, బంధువులతో అనుబంధాలు దృఢపడతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభకు, సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక సమావేశాలు, చర్చల్లో మీ ఆలోచనా విధానంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థికంగా మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పు కోల్పోకుండా సహనంతో మెలగాలి. ఖర్చులు పెరుగుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి అద్భుతమైన రోజు. అదృష్టం అనుకూలంగా ఉంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక ఒప్పందాలు చేసుకోవడానికి అనువైన రోజు. ఆర్థికంగా ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో విజయావకాశాలు పెరుగుతాయి. వ్యాపారంలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైన లాభాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తారు. మిత్రుల సహకారంతో నూతన విషయాలు నేర్చుకుంటారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా గొప్ప శుభయోగాలుంటాయి. షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు ద్వారా అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవం, ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు సంతోషదాయకంగా ఉంటుంది. స్పష్టమైన వైఖరితో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. లక్ష్మీయోగం అనుకూలంగా ఉంది. ఆర్థిక బలం పెరుగుతుంది. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు. వైవాహిక జీవితం ఆనందమయంగా గడుస్తుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ప్రతికూలత ఉండవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకూలత పెరుగుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.
