Chiranjeevi|మ‌ళ్లీ రాజ‌కీయాల ముఖం చూడ‌ను.. బ్ర‌తికినంత కాలం సినిమాల్లోనేనంటూ చిరు స్టన్నింగ్ కామెంట్స్

Chiranjeevi| మెగాస్టార్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో వైవిధ్య‌మైన

  • Publish Date - April 14, 2024 / 07:35 AM IST

Chiranjeevi| మెగాస్టార్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగుపెట్టిన చిరంజీవి ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. ఆయ‌న మాస్, క్లాస్ సినిమాలు చేశాడు. చిరంజీవి న‌ట‌న‌తో పాటు ఆయ‌న డ్యాన్స్, ఫైటింగ్స్ అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌కి పూన‌కాలు తెప్పించేవి. అయితే చిరంజీవి హవా మంచిగా న‌డుస్తున్న స‌మ‌యంలో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి తాను సినిమాలు ఇంకా చేయనని పెద్ద షాక్ ఇచ్చారు. ఆ స‌మ‌యంలో సినిమా అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. చిరంజీవి సినిమాలు ఇక చూడ‌లేమా అంటూ నిరాశ‌లో ఉన్నారు. అయితే కొన్నాళ్ల‌కి చిరు త‌న పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ప‌క్క‌కు త‌ప్పుకున్నారు.

అయితే ఆ స‌మ‌యంలో చిరంజీవిపై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చాయో మ‌నం చూశాం. వాట‌న్నింటిని ప‌ట్టించుకోకుండా చిరు మ‌ళ్లీ సినిమాల‌లోకి రీఎంట్రీ ఇచ్చి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే చిరు మ‌ళ్లీ రాజ‌కీయాల‌లోకి వెళ‌తాడేమో అని టాక్ వినిపిస్తున్న స‌మ‌యంలో ఆయ‌న తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పిన నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. తాను మొద‌లు పెట్టిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకెళ్తుండటంతో రాజ‌కీయాల‌లోకి వెళ్లి మ‌రింత సేవ చేయాల‌ని అనుకున్నాను. అయితే సేవ చేయ‌డానికి రాజ‌కీయాల‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని త‌ర్వ‌త అర్ధ‌మైంది.

నేను గబుక్కున పాలిటిక్స్ లో కాలు వేసి పొరపాటు చేసాను. త‌ప్పు తెలుసుకొని మ‌ళ్లీ సినిమాల‌లోకి వ‌చ్చారు. నేను పాలిటిక్స్‌లో ఉంటే పెద్ద ఎత్తున సేవ‌లు చేసే అవ‌కాశం ఉంటుంద‌ని అటు వెళ్లాను కాని వాటికి నేను అన‌ర్హుడు అనేది త‌ర్వాత అర్ధ‌మైంది. అందుకే తొమ్మిదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి వచ్చి సినిమాలు చేస్తున్నాను. అయితే సినిమాల‌లోకి రీఎంట్రీ ఇస్తే అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అని అనుమానంగా ఉండేది. కాని తిరిగి వచ్చాక అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం, మీ గుండెల్లో చోటు క‌ల్పించ‌డం చాలా సంతోషాన్ని అందించింది. ఇక బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటాను, ఓపిక ఉన్నంత కాలం మీకోసం సినిమాలు చేస్తూనే ఉంటాను అంటూ చిరంఈజ‌వి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. ఇక చిరు ప్ర‌స్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర చిత్రం చేస్తుండ‌గా, ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు.

Latest News