Nagarjuna| సినీ నటుడు నాగార్జునకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

వ్యక్తిగత హక్కుల రక్షణ పిటిషన్ కేసులో సినీ నటుడు నాగార్జున కు ఢిల్లీ హైకోర్టు నుంచి బిగ్ రిలీఫ్ దక్కింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

విధాత, హైదరాబాద్ : వ్యక్తిగత హక్కుల రక్షణ పిటిషన్ కేసులో సినీ నటుడు నాగార్జున(Nagarjuna) కు ఢిల్లీ హైకోర్టు( Delhi High Court) నుంచి బిగ్ రిలీఫ్(Legal Relief) దక్కింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు(Personality Rights )రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

తన వ్యక్తిగత హక్కులు, నైతిక హక్కుల్ని పరిరక్షించాలని, తన అనుమతి లేకుండా పేరు, ఫొటో, ఇతర లక్షణాలను వాడుకోకుండా సంస్థల్ని శాశ్వతంగా నియంత్రించాలని కోరుతూ నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అందుకు అంగీకరిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనకు సంబంధం లేకుండా తన ఫోటోలు, ఫీచర్స్ ను 10 వెబ్ సైట్లు వాడుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ నాగార్జున ఈ పిటిషన్ దాఖలు చేశారు.

వెబ్‌సైట్‌లు నాగార్జున వ్యక్తిత్వ హక్కులు , నైతిక హక్కులను ఉల్లంఘించకుండా, ఆయన వస్తువులు, సేవలను ఆయన నుండి వెలువడే లేదా ఆమోదించినవిగా బదిలీ చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో నిషేధం విధించింది. ఒకరి వ్యక్తిత్వ హక్కులను దోపిడీ చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కు కూడా ప్రమాదంలో పడుతుందని తెలిపింది.

నాగార్జున వినోద పరిశ్రమలో ఒక ప్రసిద్ధ వ్యక్తి అని, ఆయన్ను తప్పుదారి పట్టించే, అవమానకరమైన లేదా అనుచితమైన సెట్టింగ్‌లలో చిత్రీకరించడం తప్పనిసరిగా అతనికి నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడింది. అశ్లీల కంటెంట్‌కు సంబంధించి నాగార్జున పేరును ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 వెబ్ సైట్లకు నోటీసు అందిన 72 గంటల్లోపు సంబంధిత యూఆర్ఎల్ లను తీసివేయాలని నిలిపివేయాలని లేదా బ్లాక్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గతంలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ తరహాలోనే ఇప్పుడు నాగార్జున కూడా ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది.

Exit mobile version