Chattisghad | బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఆరుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్కు అడవుల్లో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

ఛత్తీస్ గఢ్ :

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నేషనల్‌ పార్కు అడవుల్లో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. నక్సల్స్ నుంచి భారీగా ఆయుధ సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు.