జూబ్లీహిల్స్‌లో గెలిచేదెవరు? ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి

తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొల్పిన జూబ్లీహిల్స్ బై పోల్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నమోదైంది. ఈ మేరకు పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి.

విధాత, హైదరాబాద్ : 

తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొల్పిన జూబ్లీహిల్స్ బై పోల్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నమోదైంది. ఈ మేరకు పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ జరిగింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ హస్తం వైపే మొగ్గు చూపాయి. చాణక్య స్ట్రాటజీస్ : కాంగ్రెస్ కు 46 శాతం, బీఆర్ఎస్‌కు 41శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. పబ్లిక్ పల్స్ సర్వే చూసుకుంటే.. అధికార కాంగ్రెస్ కు 48 శాతం, బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ 6 శాతంగా ఉంది. మిగత సర్వే సంస్థలు కూడా అధికార కాంగ్రెస్ గెలుస్తుందని తమ సర్వేల్లో తేల్చాయి.