కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌.. 26 లక్షల కోట్ల సంపద ఆవిరి

బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సృష్టించిన హంగామా.. స్టాక్‌మార్కెట్‌ను ఉత్సాహపర్చినా.. మంగళవారం వెలువడిన వాస్తవ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి

  • Publish Date - June 4, 2024 / 01:37 PM IST

ముంబై: బీజేపీ తిరుగులేని ఆధిక్యంతో మరోసారి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ సృష్టించిన హంగామా.. స్టాక్‌మార్కెట్‌ను ఉత్సాహపర్చినా.. మంగళవారం వెలువడిన వాస్తవ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. బీజేపీ అనేక చోట్ల దెబ్బతినడం, ఒంటరిగా మెజార్టీ సాధించలేని స్థితి, ఎన్డీయే కూటమి బొటాబొటీ మెజార్టీతోనే గెలిచే అవకాశాలు ఉండటంతో సెన్సెక్స్‌ తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో 5వేల పాయింట్లు పడిపోయింది. ఫలితంగా మదుపరులు 26 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.

బాంబే స్టాక్‌ ఎక్సేంజిలో 30 స్టాక్స్‌క గాను 26 రెడ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు నిఫ్టీలో 50కిగాను 43 పతనమయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీకి స్నేహితుడిగా చెప్పే వ్యాపార వేత్త అదానీ స్టాక్స్‌ గణనీయంగా పతనమయ్యాయి. బాంబే స్టాక్‌ మార్కెట్‌లో కీలక సూచీలు గణనీయంగా పతనం కావడం ఆర్థిక రంగంలో పెను ప్రకంపనలు సృష్టించింది. గ్లోబల్‌ మార్కెట్‌ అస్థిరత్వంతో పాటు దేశంలో రాజకీయ అనిశ్చితి కూడా ఈ పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Latest News