బీఆర్ఎస్ లో ఆస్తుల కోసమే కొట్లాటలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం
కాళేశ్వరం నివేదిక అందాకే అరెస్టులు
వచ్చే ఎన్నికల్లో 90సీట్లు గెలుస్తాం
పీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్
విధాత : బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట అని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడారు. కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అర్ధమవుతుందని..కొంత మంది బీజేపీ సీనియర్ నేతలకు మొదటి నుంచి కేసీఆర్ తో సంబంధాలున్నాయని మహేష్ కూమర్ గౌడ్ ఆరోపించారు. నేడో రేపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని..వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనపడదన్నారు. తెలంగాణ ప్రజలలో బీజేపీకి స్థానం లేదని..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90సీట్లు గెలవబోతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు రైలు పట్టాల వంటివని సైద్దాంతిక విభేదాల నేపథ్యంలో అవి ఎన్నిటికి కలవబోవన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాస్ లకు కప్పం కడుతున్నారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలు ఆయన దిగజారుడు తనాన్ని చాటుతున్నాయని..ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మడం మానేశారన్నారు.
జల్-జమీన్-జంగల్ నినాదంతో కాంగ్రెస్ ముందడుగు
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని..జల్-జమీన్-జంగల్ నినాదంతో ముందుకెలుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందిరాగాంధీ గారు గిరిజన తండాలను గుర్తించిన తొలి నేత అని, ల్యాండ్ సీలింగ్ చట్టం ఆదివాసుల అభివృద్ధికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఆ చట్టానికి జీవం పోసిన ఘనత పీవీ నరసింహారావుదని, కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల కోసం ప్రత్యేక చట్ట సవరణలు చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసులను నిర్లక్ష్యం చేసిందని, పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై కేసులు పెట్టిందని విమర్శిచారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం కింద 6.69 లక్షల ఎకరాలకు భూ హక్కులు గతంలో కాంగ్రెస్ కల్పించిందన్నారు. ఇందిర సౌర గిరి జల వికాసం గిరిజనుల జీవితాల్లో కొత్త అధ్యాయం వంటిదన్నారు. మహిళలకు ఉచిత బస్సు నుంచి సన్న బియ్యం వరకు కాంగ్రెస్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. భారత్ జోడో యాత్రలో దేశ సమస్యలను రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నారని, రాహుల్ గాంధీ ఆలోచన మేరకు కుల గణన సర్వే పూర్తి చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులదని పేర్కొన్నారు. గిరిజనులకు పీసీసీలో సముచిత ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.