విధాత : ఉత్తరాఖండ్(Uttarakhand) హరిద్వార్(Haridwar)లోని మాన్సాదేవి ఆలయం(Mansa Devi temple)లో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనలో ఆరుగురు మృతి చెందగా…పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించాయి. శ్రావణమాసం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగిపోయి భక్తుల క్యూలైన్ పై పడటంతో షాక్ కొడుతుందన్న భయంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట తలెత్తి ప్రాణనష్టానికి దారితీసింది.
తొక్కిసలాట బాధితుల్లో చిన్నారులు..మహిళలు, వృద్దులు ఎక్కువగా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తుంది. ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ స్పందించారు. తొక్కిసలాట ఘటన విచారకరమని..మృతుల కుటుంబాలకు సంతాపం తెలియచేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికార యంత్రాంతాన్ని ఆదేశించారు.