Site icon vidhaatha

hyper Aadi:లేడీస్ హాస్టల్‌లో ఉంటూ పడ‌రాని పాట్లు ప‌డ్డ హైప‌ర్ ఆది..!

hyper Aadi: జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి వ‌చ్చిన ప్ర‌ముఖ క‌మెడీయ‌న్ హైప‌ర్ ఆది. ఇప్పుడు సినిమాల‌లో నటిస్తూ మ‌రోవైపు రాజ‌కీయాల‌లో యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తున్నారు. మొద‌టి నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా అభిమానం పెంచుకున్న ఆది ఇప్పుడు ఎన్నికల సమయం రావడంతో తన అభిమానాన్ని చూపించుకునేందుకు రంగంలోకి దిగాడు. పవన్‌ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం నియోజకవర్గంలో ఆది ప్రచారం చేస్తున్నాడు. ప్ర‌తి ఒక్క‌రిని క‌లిసి పవన్‌ కల్యాణ్‌కు ఓటేసి గెలిపించాలని కోరాడు. అంతేకాకుండా ఈ సారి ప‌వ‌న్ భారీ మెజారిటీతో గెలుస్తాడ‌ని కూడా జోస్యం చెప్పాడు. అయితే ఇప్పుడు సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన హైప‌ర్ ఆది జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి రాక‌ముందు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డాడు.

జబర్థస్త్ కు రాకముందు.. జబర్థస్త్ కు వచ్చిన తరువాత తన జీవితంలో వ‌చ్చిన మార్పులు గురించి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆది. హైద‌రాబాద్ వ‌చ్చిన కొత్త‌లో చేతిలో డ‌బ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ప‌డ్డ‌ట్టు తెలియ‌జేశాడు. త‌న‌కు తెలిసిన వాళ్లు హాస్ట‌ల్ న‌డిపిస్తుంటే త‌న‌ని న‌మ్మి అందులో ఉండ‌డానికి ఛాన్స్ ఇచ్చార‌ట‌. పైన హాస్టల్ ఉంటే.. కింద తాను ఉండేవాడిని ఆది చెప్పుకొచ్చాడు. అయితే లేడీస్ మ‌ధ్య ఉండ‌డం త‌న‌కు చాలా ఇబ్బందిగా ఉండేదని, వారు తిన‌డానికి కింద‌కి వ‌చ్చిన‌ప్పుడు రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకోవ‌డ‌మో లేదంటే బ‌య‌ట‌కు వెళ్ల‌డమో చేశాన‌ని ఆది అన్నారు. ఊళ్ళో తనకు ఉన్న ఇబ్బందులు.. తన కెరీర్ నిలబడటానికి సరిపడా డబ్బులు జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ల్లే వ‌చ్చాయ‌ని చెప్పి త‌న మంచి మ‌న‌సు చాటుకున్నారు.

అయితే కంటెస్టెంట్‌గా ఉన్న‌ప్పుడు త‌న‌కు ఇబ్బందులు తీర‌లేద‌ని చెప్పిన ఆది, సెకండ్ లీడ్ పొజిషన్ వచ్చిన తరువాతే తన లైఫ్ మారిపోయింది అని చెప్పారు. ఇప్పుడు షోస్, సినిమాల‌తో బిజీబిజీగా ఉంటున్నాడు. మ‌ధ్య మ‌ధ్య‌లో ఈవెంట్స్ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. పెళ్లీడు వ‌చ్చిన హైప‌ర్ ఆది పెళ్లి మాట ఎత్తితే ఆమ‌డ‌దూరం వెళుతున్నాడు. మ‌రి అత‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాలి. పెళ్లి వార్త‌లు ఎన్ని వ‌చ్చిన కూడా ఆది మాత్రం స్పందించ‌డం లేదు.

Exit mobile version