Site icon vidhaatha

Revanth Reddy| హరీష్ రావు సభను..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ నివేదిక చర్చలో వాస్తవాలను మరుగుపరుస్తూ అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కమిషన్ నివేదికపై చర్చలో హరీష్ రావు మాట్లాడుతుండగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. ప్రాణహిత చేవెళ్లలో నీళ్లు ఉన్నాయని కేంద్ర మంత్రి ఉమా భారతి చెప్పారని..205టీఎంసీల నీళ్లు ఉన్నాయని కేంద్ర మంత్రి చెప్పారని..హరీష్ రావు ఈ విషయాన్ని ఎగ్జామ్ చేయాలని ప్రాణహిత సీఈకి ఎండార్స్ చేసిన లేఖను సభ ముందుంచుతున్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2009లోనే ప్రాణహిత చేవేళ్లలో నీళ్లు ఉన్నాయని సీడబ్ల్యూసీ పేర్కొందని తెలిపారు. వాస్తవం ఇలా ఉంటే కమిషన్ ను తప్పు పడుతూ కల్వకుంట్ల కుటుంబం విమర్శలు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. కమిషన్ల కోసం ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చారన్నారు. తప్పు చేశారని ఘోష్ కమిషన్ స్పష్టంగా చెప్పిందన్నారు.

వెంటనే హరీష్ రావు స్పందిస్తూ ఉమాభారతి రాసిన లేఖలో మూడో పేజీని కమిషన్, సీఎం ఇద్దరు కూడా ప్రస్తావించలేదని…అందులో నీళ్లు లేవని పేర్కొన్న విషయాన్ని కమిషన్ పట్టించుకోలేదని..అందుకే నేను ఆ నివేదికను రద్దు చేయాలని కోరుతున్నానన్నాను.

హరీష్ రావు వ్యాఖ్యలపై మళ్లీ రేవంత్ రెడ్డి ప్రతిస్పందిస్తూ హరీష్ రావు మరోసారి అబద్దాలే చెబుతున్నారన్నారు. 2009లో, 2014లో ప్రాణహిత చేవేళ్లకు కేంద్రం నీళ్లున్నాయని..ఇక్కడ ప్రాజెక్టుకు అనుమతులిచ్చాక కూడా మళ్లీ నీళ్లు ఉన్నాయా లేవా అంటూ కేంద్రాన్ని అడుగడంలోనే వారి దుర్బుద్దీ దాగి ఉందని..తెలంగాణ ప్రజల లక్ష కోట్లు దోపిడీ చేయాలని ఆలోచన చేసి మళ్లీ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. మహారాష్ట్ర తో హరీష్ రావు చర్చలలో నీళ్లు ఉన్నాయో లేవా అని కాదని..148 మీటర్ల, 152ఎత్తులో అన్న అంశంపైన.. 160టీఎంసీల కోసం కట్టాలా అన్నదానిపై మాత్రమే అని రేవంత్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డలో ప్రాజెక్టు నిర్మాణాన్ని రిటైర్డు ఇంజనీర్ల కమిటీ కూడా తప్పు పట్టిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇవ్వాళ విద్యాసాగర్ ఉండిఉంటే హరీష్ రావు అబద్దాలను చూసి ఆత్మహత్య చేసుకునేవారన్నారు.

Exit mobile version