Karthika Masam| ఆలయాలకు కార్తీక శోభ

కార్తీక మాసం పురస్కరించుకుని తరలివచ్చిన భక్తులతో దేశ వ్యాప్తంగా ఆలయాలు కిటకిటలాడాయి. ముఖ్యంగా నది తీర ప్రాంత దేవాలయాలలో కార్తీక మాసం సందర్భంగా నది స్నానాలు, దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలతో సందడి నెలకొంది.

విధాత : కార్తీక మాసం(Karthika Masam) పురస్కరించుకుని తరలివచ్చిన భక్తుల(Devotees)తో దేశ వ్యాప్తంగా ఆలయాలు(Temples) కిటకిటలాడాయి. ముఖ్యంగా నది తీర ప్రాంత దేవాలయాలలో కార్తీక మాసం సందర్భంగా నది స్నానాలు, దీపారాధనలు, సత్యనారాయణ స్వామి వ్రతాలతో సందడి నెలకొంది. ఇటు తెలుగు రాష్ట్రాలలోని కృష్ణా, గోదావరి తీర ప్రాంత దేవాలయాల్లో కార్తీక మాసం భక్తుల రద్దీ కనిపించింది. గోదావరి తీరం వేములవాడ రాజేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాలతో పాటు తీర ప్రాంతా దేవాలయాలు భక్తుల సందర్శనతో..పుణ్యస్నానాలు, నది జలాల్లో కార్తీక దీపారాధనలతో కళకళలాడాయి.

ఇటు కృష్ణా తీరంలోని శ్రీశైలం క్షేత్రం, జోగులాంబ క్షేత్రం, నల్లగొండ వాడపల్లి ఆగస్తేశ్వర ఆలయం, మఠంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మేళ్ల చెర్వు శివాలయం, పానగల్ ఛాయ, పచ్చల సోమేశ్వర ఆలయం, అడవిదేవులపల్లి శివాలయాలు, విజయవాడ కనకదుర్గ ఆలయాలు కార్తీక మాసం భక్తుల రద్దీతో కిటకిటాలాడాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసంహస్వామి, తిరుమల శ్రీవారి ఆలయాలకు భక్తుల పోటెత్తారు.