విధాత, హైదరాబాద్ : విద్యుత్తు ప్రమాదాలకు కారణమవుతున్నాయంటూ తెలంగాణ ప్రభుత్వం( Telangana Government)ఇంటర్నెట్ కేబుల్ వైర్ల కటింగ్(Internet Cable Cuttin)కు పాల్పడటాన్ని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ చర్యతో హైదరాబాద్(Hyderabad) అంతటా ఇంటర్నెట్ సర్వీస్ కు తీవ్ర అంతరాయం(Internet Disruption) ఏర్పడి..దైనందిక పనులన్ని గందరగోళంలో పడే పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేబుల్స్‌తో ఏదైనా సమస్య ఉంటే, సరైన ప్రక్రియను అనుసరించాలేగాని.. తెలివిలేని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ అంతటా ఇంటర్నెట్ కేబుల్‌లను ఐఎస్పీలు లేదా కస్టమర్లకు ఎటువంటి సమాచారం లేకుండానే తొలగిస్తుండటంతో నిర్వాహకులు, లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వ తెలివితక్కువ చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఒక విదూషకుడిని పరిపాలకుడిగా ఎన్నుకుంటే ఒక సర్కస్ చూడల్సి ఉంటుందని..కేబుల్ వైర్ల తొలగింపు అలాంటిదేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఇంటర్నెట్ కెబుల్స్ తో ఇబ్బంది లేదు : డీజీ కొచ్చర్
ఇంటర్నెట్ కేబుల్ లైన్స్‌తో విద్యుత్ లైన్స్‌కి సంబంధం లేదని..కేబుల్ వైర్లలో విద్యత్ సరఫరా అవ్వదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరక్టర్ జనరల్(సీవోఏఐ) లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ ఎస్పీ కొచ్చర్ స్పష్టం చేశారు. కేబుల్ లైన్స్‌ని విద్యుత్ శాఖ కట్ చేస్తే.. హైదరాబాద్ నగరానికి ఇంటర్నెట్ సేవలలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.