విధాత : బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కు లగచర్ల (Lagacharla), కొడంగల్(Kodanga) గిరిజన మహిళలు(Tribal Women) రాఖీ(Rakhi)పండుగ పురస్కరించుకుని రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుని…మా భర్తలను, కుటుంబ సభ్యులను జైలు పాలు చేసిన సందర్భంలో కేటీఆర్ మాకు అన్నగా అండగా నిలిచాడని తెలిపారు. అందుకే ఆయనకు రాఖీ కట్టి మా అభిమానాన్ని చాటుకున్నట్లుగా తెలిపారు.
లగచర్లకు చెందిన జ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం మా భూములు తీసుకుని..నా భర్తను, కుటుంబ సభ్యులను జైలుకు పంపితే.. దిక్కులేని పరిస్థితుల్లో ఓ అన్నగా కేటీఆర్ నిండు గర్బిణిగా ఉన్న నా యోగక్షేమాలను చూసుకుని..నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పెట్టిండని గుర్తు చేసుకుంది. కేసీఆర్ మా అందరికి అందించిన న్యాయపర సహకారంతో.. ఢిల్లీ వరకు సాగించిన పోరాటంతో ప్రభుత్వం భూసేకరణ వెనక్కి తీసుకుంది…మా వాళ్లంతా జైలు నుంచి విడుదలయ్యారని గుర్తు చేసుకున్నారు. అన్నలా మా అందరిని ఆదుకున్న కేటీఆర్ ఇంటికి వచ్చి మేం రాఖీ కట్టడం మాకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.