Site icon vidhaatha

Diamond Hunt| కూలీ చేతికి దొరికిన రూ.40లక్షల వజ్రం!

Lucky Labourer : కర్నూలు(Kurnool) జిల్లా తుగ్గలి మండలం(Tuggal Mandal) జొన్నగిరి(Jonnagiri) గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ(Agriculture Labour)ని అదృష్టం(Luck) వరించింది. రోజు కూలీ రూ. 300 రూపాయలు కూలి పనికి వెళ్ళిన వ్యవసాయ కూలీకి రూ..40లక్షల వజ్రం(Rare Diamond)దొరికింది. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళా కూలీకి ఈ విలువైన వజ్రం లభించింది. వ్యవసాయ కూలీకి దొరికిన ఈ వజ్రాన్ని ఓ వ్యాపారి రూ. 40 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే బహిరంగ మార్కెట్ లో దాని విలువ రూ.70లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. దొరికిన వజ్రం విలువ ఎంత చేస్తుందన్న అవగాహన లేక తక్కువ ధరకే ఆ మహిళ కూలీ దానిని అమ్మేసుకుంది .వర్షాలు కురిస్తే ఈ ప్రాంత పొలాలలో వజ్రాలు దొరకడం సాధారణం. అయితే ఈ సీజన్ లో లభ్యమైన అత్యంత విలువైన వజ్రం ఇదేనని స్థానికులు చెబుతున్నారు.

గతంలో జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళకు కోటి 20 లక్షల వజ్రం దొరికింది. మరోసారి రూ. 40 లక్షల వజ్రం దొరకడంతో గ్రామంలో వజ్రాల అన్వేషణDiamond Hunt ఊపు అందుకుంది. దాదాపుగా 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వజ్రాలు.. పంట పొలాల నుంచి బయటకు తేలికగా కనిపిస్తుండడంతో వజ్రాల కోసం అన్వేషణ భారీగా సాగిస్తున్నారు. వజ్రాల వేటలో అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో..ఒకరోజులో లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు ఎవరవుతారో వారి అదృష్టంపైనే ఆధారపడి ఉంది.

Exit mobile version