Lok Sabha e-cigarette debate| లోక్ సభలో ఈ-సిగరెట్ దుమారం

ప్రజా సమస్యలు..ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగాల్సిన దేశ అత్యున్నత చట్టసభ లోక్ సభలో ఈ -సిగరేట్(ఎలక్ట్రానిక్ సిగరెట్) పై చర్చ దుమారం రేపింది. గురువారం లోక్ సభలో ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆకస్మికంగా ఈ -సిగరేట్ ప్రస్తావన తెచ్చి అందరిని విస్మయ పరిచారు. దేశంలో నిషేధిత ఈ -సిగరెట్ ను టీఎంసీ సభ్యులు తాగుతుండగా చూశానని..దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ను కోరారు.

న్యూఢిల్లీ : ప్రజా సమస్యలు..ప్రభుత్వ విధానాలపై చర్చ జరుగాల్సిన దేశ అత్యున్నత చట్టసభ లోక్ సభ(Lok Sabha) లో ఈ -సిగరేట్(ఎలక్ట్రానిక్ సిగరెట్) పై చర్చ(E-Cigarette Debate) దుమారం రేపింది. గురువారం లోక్ సభలో ఎంపీ అనురాగ్ ఠాకూర్( Anurag Thakur)ఆకస్మికంగా ఈ -సిగరేట్ ప్రస్తావన తెచ్చి అందరిని విస్మయ పరిచారు. దేశంలో నిషేధిత ఈ -సిగరెట్ ను టీఎంసీ సభ్యులు(TMC MPs) తాగుతుండగా చూశానని..దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ను కోరారు. స్పందించిన స్పీకర్ ఓం బిర్లా(Om Birla) లోక్ సభలో ఈ- సిగరేట్ తాగినట్లుగా నా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. వెంటనే సభ్యులను ఉద్దేశించి రూల్ పాస్ చేశారు.

దేశంలో ఈ-సిగరెట్లను నిషేధిస్తు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లును సైతం 2019లో పార్లమెంటు ఆమోదించింది. అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఈ సిగరెట్ నిషేధిత బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగా..సభ ఆమోదించింది. దీంతో దేశంలో ఈ-సిగరెట్ల తయారీ, అమ్మకం, దిగుమతి బ్యాన్ అమల్లోకి వచ్చింది. బిల్లు ప్రకారం..బిల్లు నిబంధనలను ఉల్లంఘించే ఏ వ్యక్తికైనా ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ. 1 లక్ష వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి. తదుపరి ఇదే విషయమై నేరానికి, మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ప్రతిపాదిత చట్టం ఈ-సిగరెట్ల నిల్వ కోసం ఏ స్థలాన్నైనా ఉపయోగించడాన్ని నిషేధిస్తుంది. ఈ-సిగరెట్లను నిల్వ చేసే వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 50,000 వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి. ఈ సిగరేట్ క్యాన్సర్ కారకం కావడంతో నిషేధం అనివార్యమైంది.

అమెరికాలో ఈ-సిగరెట్లపై బ్యాన్ విధించిన తొలి స్టేట్‌గా మిచిగాన్ నిలిచింది. ఆ తర్వాత న్యూయర్క్, భారత్ కూడా దీనిపై నిర్ణయం తీసుకుంది. ఇ-సిగరెట్లలో దాదాపు 400 బ్రాండ్లు ఉన్నాయని, ఇవేవీ భారత్‌లో తయారు కాకపోవడం గమనార్హం. ఇవి 150 ఫ్లేవర్లలో లభ్యమౌతున్నాయి. దేశంలో ప్రతి ఏడాది దాదాపు 9 లక్షల మంది పొగాకు సంబంధిత అనారోగ్యాల కారణంగా మరణిస్తున్నారు. భారత్‌లో 10.6 కోట్ల మంది యువతకు పొగ తాగే అలవాటు ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారత్ ధూమపానంలో రెండో స్థానంలో ఉంది.

Latest News