న్యూఢిల్లీ : మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్’(వీబీ జీ రామ్ జీ) గా మారుస్తూ రూపొందించిన బిల్లుకు విపక్షాల నిరసనల మధ్య గురువారం లోక్ సభ ఆమోదించింది. బిల్లు ఆమోదం సమయంలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. సంబంధిత బిల్లు పత్రాలను చించి విసిరేసి ప్రభుత్వ నిర్ణయానికి, బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘వీబీ జీ రామ్ జీ’ బిల్లుఆమోదం అనంతరం లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.
అంతకుముందు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ బదులిచ్చారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనపై విమర్శలు గుప్పించారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వాలు చంపేశాయని, ఎన్డీయే ప్రభుత్వం బాపు స్ఫూర్తితో పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని, పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని చెప్పుకొచ్చారు. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో గాంధీజీ కలలను మేం సాకారం చేస్తున్నాం అని తెలిపారు.
వాస్తవానికి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ‘ఎన్‌ఆర్‌ఈజీఏ’(NREGA) అనే పేరు ఉండేదని. ఆ తర్వాత 2009లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మాగాంధీ పేరు చేర్చిందని శివరాజ్ సింగ్ చౌహాన్ గుర్తు చేశారు. పథకం అమలులో అనేక లోటుపాట్లు చోటుచేసుకున్నాయని విమర్శించారు. గతంలోనే అనేక పథకాలకు కాంగ్రెస్ గాంధీ-నెహ్రూ పేర్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేసిందన్న సంగతి మరువరాదన్నారు.
ఇవి కూడా చదవండి :
Kallem Narsimha Reddy : బతికుండగానే విగ్రహం..స్వీయ ఆవిష్కరణ!
Bomb Threat : నాంపల్లి కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
