Site icon vidhaatha

Wildlife Wonders| తప్పిపోయిన గాడిద..ఆరేళ్లకు జింకల గుంపులో ప్రత్యక్షం !

విధాత : ప్రకృతిలోని అనంతకోటి జీవరాశులు(Wildlife Conservation)..తమ మనుగడ క్రమంలో అనేక జీవ వైవిధ్యాలకు గురువుతుండటం..ఒక్కోసారి సహజ లక్షణాలకు విరుద్దంగా జాతి వైరాలను విస్మరించి(Animal Friendship) జీవిస్తుండటం(Nature Wonders) చూస్తుంటాం. అలాంటి ఘటనే అమెరికా(USA)లోని వ్యోమింగ్( Wyoming)లో చోటుచేసుకుంది. ఆరు సంవత్సరాల క్రితం వ్యోమింగ్‌లో డీజిల్ అనే పేరుతో పిలిచే పెంపుడు గాడిద(Lost Donkey) తప్పిపోయింది. యాజమానులు ఎంత వెతికినా దాని జాడ దొరకలేదు. ఆరు సంవత్సరాల తర్వాత ఆ గాడిద సమీప అటవీ ప్రాంతంలో కొమ్ముల జింకల(ఎల్క్ కమ్యూనిటీ)లోని ఆడ జింకల(Elk Herd) సమూహంలో కనిపించింది.

అరుదైన జాతిగా భావిస్తున్న ఎల్క్ జింకల సమూహంలో డీజిల్ గాడిద కలిసిపోయి(Inter-species Bonding) వాటితో జాతి వైరాన్ని మరిచి వాటితోనే సహవాసం చేస్తూ మనుగడ సాగిస్తున్న తీరు వారిని అశ్చర్య పరిచింది. పూర్తిగా భిన్నమైన జాతితో కలిసి సురక్షితంగా జీవిస్తున్న గాడిదను చూసిన అధికారులు దానిని ఆ ఎల్క్ జింకల సమూహంతోనే ఉండేందుకు అనుమతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

 

Exit mobile version