Ship Launch Mishap: భారీ ఖర్చు పెట్టి తయారు చేసిన ఓ లగ్జరీ నౌక(Luxury Ship)ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునిగిన(ship sinking) ఘటన వీడియో వైరల్(viral video)గా మారింది. ఉత్తర Turkeyతుర్కియో(టర్కీ)లోని జోంగుల్డాక్(Zonguldak Shipyard Accident) తీరంలోని మెడ్ యిల్మాజ్ షిప్‌యార్డ్‌లో రూ.8.74కోట్లతో నిర్మించిన లగ్జరీ నౌకను మంగళవారం ప్రారంభించారు. కొంత మంది ప్రయాణికులు, సిబ్బందితో జలప్రవేశం చేసిన నిమిషాల్లోనే ఆకస్మాత్తుగా అది సముద్రంలో ఓ వైపు ఒరిగిపోయి మునిగిపోయింది. వెంటనే తేరుకున్న సిబ్బంది, ప్రయాణికులు నౌక నుంచి సముద్రంలోకి దూకేశారు. ఆ తర్వాత వారందరిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా(passengers rescue) ఒడ్డుకు చేర్చారు.
ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దీనిపై త్వరలోనే విచారణ చేపడతామని టర్కీ నౌక దళం అధికారులు తెలిపారు. నౌకను జల ప్రవేశం..ఆ వెంటనే అది సముద్రంలో మునిగిపోవడంకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తుర్కియో ఇటీవల ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఇండియా పాకిస్తాన్ సైనిక ఘర్షణల్లో పాక్ కు మద్దతుగా ఆయుధ సహాయాన్ని అందించింది. ఈ యుద్దంలో వందలాది తుర్కియో డ్రోన్ లను భారత సైన్యం విజయవంతంగా కూల్చేసింది.