న్యూఢిల్లీ : మెక్సికోలో వరదలు(Mexico Floods) బీభత్సం(Disaster) సృష్టించాయి. వరదల్లో ఇప్పటివరకు 40 మంది మృతి చెందగా..వందల మందికి గాయాలయ్యాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. వరదల ధాటికి రహదారులు ధ్వంసమైపోగా..వాహనాలు కొట్టుకపోయాయి. ఇళ్లు నీటమునిగాయి. మెక్సికో వీధులు 12 అడుగుల వరకు నీటితో నిండిపోయాయి. అనేక నగరాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. మెక్సికోలోని పాజ్ రికాలో కాజోన్స్ నది ఉప్పొంగడంతో.. నదీజలాలు నగరాల్లోకి ప్రవేశించాయి. చాలా కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు కూలిపోయాయి. రోడ్లన్నీ పూర్తిగా చెత్తాచెదారం, బురదతో నిండిపోయాయి. ప్యూబ్లాలో, హిడాల్గోలో వరదలలో 20మంది మరణించారు.
వెరాక్రూజ్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోగా, 27 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్ వెతుకుతోంది. 42 ప్రాంతాలలో రోడ్ల కనెక్టివిటీ తెగిపోయింది.