Musi River| మూసీకి వరద..అక్కడ రాకపోకలు బంద్

జంటనగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలు..జలాశయాల నుంచి విడుదలవుతున్న వరదలతో మూసీ నది పోటెత్తి ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాజ్ వేల మీదుగా మూసీ పరవళ్లు సాగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

విధాత : జంటనగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలు..జలాశయాల నుంచి విడుదలవుతున్న వరదలతో మూసీ నది( Musi River) పోటెత్తి ప్రవహిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో(Yadadri Bhongir) మూసీనది వరద జూలూరు గ్రామంలో కాజ్ వే మీదుగా ప్రవహిస్తుండటంతో ఇరువైపుల భారీ కేడ్లు పెట్టి రాకపోకలు(disrupting traffic) నిలిపివేశారు. దీంతో బీబీనగర్ – పోచంపల్లి మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

అటు వలిగొండ మండలం సంగెం భీమలింగం కాజ్ వే మీదుగా కూడా మూసీ పరవళ్లు తొక్కుతుండటంతో వలిగొండ , సంగెం, చౌటుప్పల్ ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ వరద ఉదృతి పెరిగిపోవడంతో కేతేపల్లి మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో మూసీ నది వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలిసేందుకు పరుగులు తీస్తుంది.

Exit mobile version