- employees donation । వరద బాధితులకు సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఒక్క రోజు వేతనం రూ. 100 కోట్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తమ వేతనం నుంచి ఒక్క రోజు జీతాన్ని మినహాయించుకొని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పంపించాలని తెలియజేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బ్రుందం సీఎస్ శాంతి కుమారికి కాన్సంట్ లెటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం తగిన సహాయక చర్యలను వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగులుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగిచిందన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.
employees donation । వరద బాధితులకు సహాయంగా ఉద్యోగుల ఒక రోజు వేతనం రూ.100 కోట్ల విరాళం
తమ వేతనం నుంచి ఒక్క రోజు జీతాన్ని మినహాయించుకొని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పంపించాలని తెలియజేస్తూ మంగళవారం తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నాయకత్వంలోని ప్రతినిధి బ్రుందం సీఎస్ శాంతి కుమారికి కాన్సంట్ లెటర్ ఇచ్చారు.

Latest News
క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే ఏం జరుగుతుంది?
కేంద్రం కొత్తరూల్.. సిమ్ లేకపోతే మీ వాట్సాప్ పనిచేయదు
CORE, PURE, RARE రీజియన్లుగా తెలంగాణ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
మోదీపై సుబ్రమణియన్ స్వామి సీరియస్ కామెంట్స్
భోజనంగా అన్నం – రొట్టె : ఏది మంచిది?
ఆయుధాలు వీడి.. జనంలోకి : 37 మంది మావోయిస్టుల లొంగుబాటు
మన శంకర వరప్రసాద్ గారు’పై ఆకాశాన్నంటుతున్న అంచనాలు..
ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తే ఏం చేయాలి?
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్.. డిసెంబర్లో 18రోజుల పాటు సెలవులు
ఐబొమ్మలో సినిమాలు చూశాను : సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు