PBKS vs RR|గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఓడిన పంజాబ్.. బౌల‌ర్స్‌కి చుక్క‌లు చూపించిన హెట్‌మెయిర్

PBKS vs RR|ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి విజ‌యాలని అందుకుంటూ ప్లేఆఫ్స్ వైపు దూసుకుపోతుంది. జ‌ట్టులో ప్ర‌తి ఒక్క‌రు కూడా అద్భుతంగా రాణిస్తుండ‌డంతో ఆర్ఆర్ సునాయాసంగా విజ‌యాలు సాధిస్తుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలి

  • Publish Date - April 14, 2024 / 06:43 AM IST

PBKS vs RR|ఐపీఎల్ 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి విజ‌యాలని అందుకుంటూ ప్లేఆఫ్స్ వైపు దూసుకుపోతుంది. జ‌ట్టులో ప్ర‌తి ఒక్క‌రు కూడా అద్భుతంగా రాణిస్తుండ‌డంతో ఆర్ఆర్ సునాయాసంగా విజ‌యాలు సాధిస్తుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచింది. చివ‌రి ఓవ‌ర్ వరకు మ్యాచ్ ఉత్కంఠ‌గా సాగింది. అయితే షిమ్రాన్ హెట్‌మైర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) సంచలన బ్యాటింగ్ చేసి ఆర్ఆర్‌టీంకి చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్ర‌మే చేసింది. పంజాబ్ జ‌ట్టులో జితేశ్ శర్మ(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31) మాత్ర‌మే కాస్త ప‌రుగులు రాబ‌ట్టారు.

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు నిప్పులు చెరిగే బౌలింగ్‌తో పంజాబ్‌ని వ‌ణికించారు. ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు. అయితే 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించేందుకు కూడా రాజస్థాన్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలం కావ‌డంతో చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు మ్యాచ్ ట‌ఫ్‌గా వ‌చ్చింది. పంజాబ్ గెలుస్తుందిలే అనుకున్న స‌మ‌యంలో హెట్‌మయర్ వీర‌విహ‌రం చేసి త‌మ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించాడు. ఆఖరి ఓవర్ లో హెట్మెయర్ సిక్స్, ఫోర్ కొట్టడంతో పంజాబ్ కు మళ్లీ నిరాశ తప్పలేదు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్ దిశగా మరో అడుగు ముందుకేసింది అని కూడా చెప్పాలి.

రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట్స్‌మెన్స్ లో యశస్వి జైస్వాల్(28 బంతుల్లో 4 ఫోర్లతో 39) మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడ‌నే చెప్పాలి. అత‌ను పెద్ద స్కోరు చేయ‌లేక‌పోయాడు. భారీ సిక్సర్‌తో దూకుడు కనబర్చిన కెప్టెన్ సంజూ శాంసన్‌ను ర‌బాడా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రియాన్ పరాగ్(23) పోరాడే ప్రయత్నం చేసిన కూడా అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ త‌ర్వాత ధ్రువ్ జురెల్‌ను హర్షల్ పటేల్ ఔట్ చేయడంతో రాజస్ఠాన్ రాయల్స్‌ ఇబ్బందుల్లో పడింది. జట్టు విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు అవ‌ర‌స‌మైన స‌మయంలో 19వ ఓవర్‌లో పోవెల్ వరుసగా రెండు బౌండరీలు బాది ఔట‌య్యాడు. చివ‌రి ఓవ‌ర్‌లో విజ‌యానికి 10 పరుగులు అవసరమవ్వగా.. హెట్‌మైర్ రెండు భారీ సిక్స్‌లు బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Latest News