IPL 2024| ఈ సారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారుతుంది. ఒక్కో మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా సాగడం, అలానే ఊహించని విజయాలు కొన్ని జట్లు సాధించడంతో ప్లే ఆఫ్ రేసు మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. గత రాత్రి లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంతో కొంత వరకు ఢిల్లీ ప్లేఆఫ్‌కి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రస్తుతం ప్లేఆఫ్స్‌కి వెళ్లిన జట్లు చూస్తే కోల్ కతా నైట్ రైడర్స్ (13 మ్యాచుల్లో 19 పాయింట్లు)తో టాప్ లో ఉండగా , రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (12 మ్యాచుల్లో 16 పాయింట్లు) ఉంది. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు పోటీ పడుతున్నాయి.
అయితే తాజా మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపుతో సీఎస్కే, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ లకి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపడినట్టు అయింది. మ్యాచ్‌లో లక్నో గెలిచి ఉంటే 16 పాయింట్లు సాధించే అవకాశం ఉండేది. కాని ఒకటి ఓడింది. మరొకటి బ్యాలెన్స్ ఉంది. ఈ క్రమంలో లక్నో జట్టు గరిష్టంగా 14 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎల్ఎస్జీ, డీసీలు పేలవమైన రన్ రేట్ ఉన్న కారణంగా ప్లే ఆఫ్ అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ కు మంచి అవకాశం ఉంది. 13 మ్యాచ్ ల్లో 14 పాయింట్లు (ఎన్ ఆర్ ఆర్ +0.528) తో ఉంది. ఆర్సీబీతో ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. అది గెలిస్తే దాదాపు ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం ఖాయం. సన్ రైజన్స్ (12 మ్యాచ్ల్లో 14 పాయింట్లు) తమ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన చెన్నై సులువుగానే ప్లేఆఫ్స్ కు చేరుతుంది.
ఇక సన్‌రైజర్స్ చూస్తే..ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే నే ప్లేఆఫ్ స్థానం ఖాయం. ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లేఆఫ్ కష్టాలు పెరుగుతాయి. ఈ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోతే ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సీఎస్కే ఆర్సీబీని ఓడించిన, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచుల్లో ఓడిన కూడా ఎల్ఎస్జీ, డీసీల కంటే మెరుగైన రన్ రేట్ను కొనసాగించి చివరి ప్లే ఆఫ్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు. ఆర్సీబీ క్వాలిఫై కావాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి 14 పాయింట్లు సాధించాలి. ప్లేఆఫ్స్ నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న ఇతర జట్ల కంటే తమ నెట్ రన్ రేటు పెంచుకోవడానికి చూడాలి.ఇక డీసీ క్వాలిఫై కావాలంటే ఎస్ఆర్హెచ్, సీఎస్కే, ఆర్సీబీ, ఎల్ఎస్జీ జట్లు తమ చివరి మ్యాచ్ లలో భారీ తేడాతో ఓడిపోవాలి. ఇది అసాధ్యం. ఇక లక్నో డీసీ చేతిలో ఓటమి తర్వాత మైనస్ 0.787కు పడిపోయింది. చివరి మ్యాచ్ తో భారీ తేడాతో గెలవడంతో పాటు సీఎస్కే, సన్‌రైజర్స్, ఆర్సీబీ జట్లు కూడా భారీ తేడాతో ఓడిపోతే లక్నో కు టాప్-4లో చోటు దక్కే అవకాశం ఉంది.