PBKS vs RCB| గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ నుండి నిష్క్ర‌మించిన మరో టీం

PBKS vs RCB| ఐపీఎల్ సీజ‌న్ 17లో ప్లేఆఫ్స్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఇన్నాళ్లు లీగ్‌లు ఆడిన జ‌ట్లు మ‌రి కొద్ది రోజుల‌లో ప్లే ఆఫ్స్ ఆడ‌బోతున్నాయి. అయితే ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది, ఏ జ‌ట్టు నిష్క్ర‌మిస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ల‌క్నోపై ఎస్ఆర్‌హెచ్ భారీ విజయం సాధించ‌డంతో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అధికారికంగా ఈ సీజ‌న్ నుండి నిష్క్ర‌మించింది. ఇక ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓట‌మి చెంద‌డంతో ఇప్పుడు ఆ జ‌ట్టు కూడా

PBKS vs RCB| ఐపీఎల్ సీజ‌న్ 17లో ప్లేఆఫ్స్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డింది. ఇన్నాళ్లు లీగ్‌లు ఆడిన జ‌ట్లు మ‌రి కొద్ది రోజుల‌లో ప్లే ఆఫ్స్ ఆడ‌బోతున్నాయి. అయితే ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది, ఏ జ‌ట్టు నిష్క్ర‌మిస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ల‌క్నోపై ఎస్ఆర్‌హెచ్ భారీ విజయం సాధించ‌డంతో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు అధికారికంగా ఈ సీజ‌న్ నుండి నిష్క్ర‌మించింది. ఇక ఆర్సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓట‌మి చెంద‌డంతో ఇప్పుడు ఆ జ‌ట్టు కూడా అఫీషియ‌ల్‌గా ఐపీఎల్ నుండి ఔట్ అయింది. సీజన్‌లో ఎలిమినేట్ అయిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. మరోవైపు డూ ఆర్ డై మ్యాచ్‌లో విజయం సాధించిన ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 241 పరుగులు చేసింది.

మ‌రోసారి విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో, 7×4, 6×6) అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రజత్ పటిదార్ (55; 23 బంతుల్లో, 3×4, 6×6), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో, 5×4, 1×6) కూడా బ్యాట్ ఝుళిపించ‌డంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించింది. డుప్లెసిస్ (9; 7 బంతుల్లో, 2×4), విల్ జాక్స్‌ (12; 7 బంతుల్లో, 1×4, 1×6) ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు (3/38), అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప (2/36) రెండు వికెట్లు తీసుకున్నారు.ఇక భారీ ల‌క్ష్య చేధ‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్ జ‌ట్టు 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది.

అయితే పంజాబ్ కూడా ఆర్సీబీకి గ‌ట్టి పోటీనే ఇచ్చింది. 10 ఓవర్లకు పంజాబ్ జ‌ట్టు మూడు వికెట్లు కోల్పోయి 114 ప‌రుగులు చేసింది. అయితే ఆ త‌ర్వాత‌ ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసి పంజాబ్‌పై తీవ్ర‌మైన ఓత్తిడిపెంచారు. 125/3తో ఉన్న పంజాబ్ 56 పరుగుల వ్యవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయిందంటే ఆర్సీబీ బౌల‌ర్స్ చివ‌ర్లో ఎంత క‌ట్ట‌డి చేశార‌లో అర్ధ‌మ‌వుతుంది. రొసో (61; 27 బంతుల్లో, 9×4, 3×6) టాప్ స్కోరర్ కాగా, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1×6), బె‌యిర్‌స్టో (27; 16 బంతుల్లో, 4×4, 1×6) , శశాంక్ సింగ్ (37; 19 బంతుల్లో, 4×4, 2×6), సామ్ కరన్ (22; 16 బంతుల్లో, 2×4) భారీగా ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో విఫ‌లం అయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ (3/43) మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్ (2/28), ఫెర్గూసన్ (2/29), కర్ణ్ శర్మ (2/36) తలో రెండు వికెట్లు తీశారు.

 

Latest News