Rahul Sipligunj surprise|కాబోయే భార్యకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కాబోయే భార్యకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ నెల 27న జరగనున్న రాహుల్-హరిణ్య వివాహం వేడుకలలో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో హరిణ్యకు రాహుల్ సర్ ప్రైజ్‌ ఇచ్చారు. హరిణ్య అభిమానించే టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్‌ని సంగీత్ వేడుకకు ఆహ్వానించి, తన కాబోయే భార్యకు రాహుల్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు.

విధాత, హైదరాబాద్ : ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) కాబోయే భార్య హరిణి(Harini)కి సర్ ప్రైజ్(surprise)  ఇచ్చారు. ఈ నెల 27న జరగనున్న రాహుల్-హరిణ్య వివాహం వేడుకలలో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో హరిణ్యకు రాహుల్ సర్ ప్రైజ్‌ ఇచ్చారు.

హరిణ్య అభిమానించే టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్‌(Yuzvendra Chahal)ని సంగీత్ వేడుకకు ఆహ్వానించి, తన కాబోయే భార్యకు రాహుల్ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. చాహాల్ రాకతో సర్ ప్రైజ్ అయిన హరిణ్య ‘ఇది నా జీవితంలో మర్చిపోలేను.ఇది తనకు పెద్ద సర్‌ప్రైజ్‌ అంటూ చాహల్‌తో దిగిన ఫొటోను హరిణ్య పంచుకున్నారు.

థ్యాంక్ యూ రాహుల్!’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను చాహల్‌కు వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అని హరిణ్య పోస్ట్‌ పెట్టారు. సంగీత్ వేడుకకు వచ్చిన చాహల్‌ కాబోయే వధూవరులతో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Latest News