Tariffs | ‘ట్రంప్ టారిఫ్‌లు మూడవ ప్రపంచ యుద్ధం లాంటిది’..బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు

భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై ఆయన స్పందిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ లను రాందేవ్ బాబా ఉగ్రవాదంగా అభివర్ణిస్తూ వాటిని ఆర్థిక యుద్ధంతో పోల్చారు.

భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సహ వ్యవస్థాపకుడు బాబా రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా విధిస్తున్న భారీ సుంకాలపై ఆయన స్పందిస్తూ.. డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ లను రాందేవ్ బాబా ఉగ్రవాదంగా అభివర్ణిస్తూ వాటిని ఆర్థిక యుద్ధంతో పోల్చారు. ట్రంప్ టారీఫ్ లు టెర్రరిజంతో సమానమైనవని.. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే అది ఈ ఆర్థిక యుద్ధం రూపంలోనే ఉంటుందని రాందేవ్ బాబా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రస్తుత ఆర్థిక విధానాలు ప్రపంచంలో అసమానత, అన్యాయం, దోపిడీ, రక్తపాతం పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. కొద్దిమంది వ్యక్తులు ప్రపంచ శక్తిని, సంపదను నియంత్రించే వ్యవస్థ ప్రమాదకరమని, మానవత్వానికి ఇది విపత్తుగా మారుతోందని హెచ్చరించారు.

ప్రతి ఒక్కరూ తమ సరిహద్దుల్లోనే నిలబడి, అందరినీ కలుపుకుని ముందుకు సాగాల్సిన అమసరం ఉందని బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. కొద్దిమంది మాత్రమే ప్రపంచ శక్తిని నియంత్రిస్తే, అసమానత, అన్యాయం వ్యాపిస్తాయని హెచ్చరించారు. ఈ ఆర్థిక యుధ్దానికి ‘స్వదేశీ’ సమాధానం అని స్పష్టం చేశారు. స్వదేశీ అనేది కేవలం భారతీయ ఉత్పత్తులు కొనడం కాదు అని, సమాజంలో చివరి వ్యక్తి వరకు స్వాలంబన, స్వయం సమృద్ధి, ఉద్ధరణ తత్వ శాస్త్రం అని రాందేవ్ బాబా వివరించారు. మహర్షి దయానంద్ నుంచి స్వామి వివేకానంద వరకు అనేక మంది మహనీయులు ఈ స్వదేశీ భావనను బలపరిచారని ఆయన గుర్తుచేశారు. ‘ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలి, అభివృద్ధి చెందాలి, చుట్టూ ఉన్నవారిని కూడా అభివృద్ధి చేయాలి ఇదే స్వదేశీ మూలం’ అని బాబా రాందేవ్ బాబా స్పష్టం చేశారు.

అసలెంటీ భారత్–అమెరికా వాణిజ్య వివాదం..

ప్రస్తుతం అమెరికా భారత దిగుమతులపై 50 శాతం వరకు టారీఫ్ లు విదించింది. వీటి వల్ల భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పోటీ కోల్పోతున్నాయి. రెండు దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందంపై చర్చలు చివరి దశకు చేరాయి. ఈ క్రమంలో అమెరికా, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించాలని ఒత్తిడి తెస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇంధన స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారంపై రాజీ పడబోమని స్పష్టం చేసింది.