T20I World Cup 2024|టీ 20 ప్ర‌పంచ క‌ప్‌లో ఛాన్స్ కోసం క‌ష్ట‌ప‌డుతున్న కుర్రాళ్లు.. ఆ ప‌ది మందికి ఛాన్స్ ప‌క్కా

T20I World Cup 2024| ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భార‌త ఆట‌గాళ్లు ఇది పూర్త‌య్యాక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఆడ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో ఛాన్స్ ద‌క్కించుకోవాల‌ని కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్ర‌తిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్చ వేదిక‌ల‌లో జ‌ర‌గ‌నుంది. అయితే

  • Publish Date - April 19, 2024 / 11:03 AM IST

T20I World Cup 2024| ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న భార‌త ఆట‌గాళ్లు ఇది పూర్త‌య్యాక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీ ఆడ‌నున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క టోర్నీలో ఛాన్స్ ద‌క్కించుకోవాల‌ని కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ప్ర‌తిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి యూఎస్ఏ, వెస్టిండీస్చ వేదిక‌ల‌లో జ‌ర‌గ‌నుంది. అయితే ఈ ప్ర‌పంచ క‌ప్‌లో భార‌త్ నుండి ఏఏ ఆటగాళ్లు ఆడ‌తార‌నే దానిపై కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. జట్టులో ఓపెనర్లుగా ఎవరు , .. బౌలర్లు ఎంతమంది ఉండాలి? ఏఏ యువ ప్లేయర్లని తీసుకోవాలి, ఆల్‌రౌండ‌ర్స్ ఎంత మందిని సెల‌క్ట్ చేయాలి వంటి విష‌యాల‌పై బీసీసీఐ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారు. గతవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ…ఈ ప్ర‌పంచ క‌ప్ గురించి చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఐపీఎల్ టోర్నీలో కూడా స‌గం మ్యాచ్‌లు పూర్త‌య్యాయి. కొంద‌రు కుర్రాళ్లు త‌మ ఆట‌తో సెల‌క్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎవ‌రెవ‌రిని ఎంపిక చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. ముందుగా రోహిత్ శర్మతో కలిసి విరాట్‌ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ బ్యాకప్ ఓపెనర్ గా ఉండొచ్చు. యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ఐపీఎల్ 2024లో అద‌ర‌గొడుతున్నాడు. అత‌ను రాబోయే మ్యాచ్‌ల‌లోను ఇలానే ఆడితే ఛాన్స్ ప‌క్కా అంటున్నారు. హార్దిక్ పాండ్యాకు టీ20 వరల్డ్ కప్ లో చోటుదక్కుతుందా? లేదా అనే అంశంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఐపీఎల్ 2024లో ముంబై జట్టు కెప్టెన్ గా ఉన్న హార్ధిక్ పాండ్యా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో తేలిపోతున్నాడు.

దీంతో హార్దిక్ కు తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని తెలుస్తోంది. ఇక మిగ‌తా జ‌ట్టు స‌భ్యులు చూస్తే… సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ , రింకు సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జైతే శర్మ/సంజు శాంసన్ , రవి బిష్ణోయ్ ల‌కి ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. చూడాలి మ‌రి బీసీసీఐ పెద్ద‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో.

Latest News