Site icon vidhaatha

రాష్ట్రంలో టీనేజీ ఓటర్లు 2,78,650

విధాత: రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కు పొందిన 18 నుంచి19 ఏళ్లలోపు యువతీ యువకులు 2,78,650 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ మేరకు 2023 జనవరి 1 నాటికి నూతన ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. ఈ ఏడాది కొత్త ఓటర్లు అధికంగా నమోదు చేసుకోవడం గమనార్హం. ఎన్నారైలకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉండడంతో 2740 మంది ఓటు నమోదు చేయించుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2,99,77,659 మంది ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో పురుషులు 1,50,50,243 మంది కాగా మహిళలు 1,49,25,243 ఉన్నట్లు తెలిపింది. థర్డ్‌ జండర్‌ ఓటర్లు 1,952 మంది ఉన్నారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,891 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నది. ఈ మేరకు జిల్లాల వారిగా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తన జాబితాలోపొందు పరిచింది.

Exit mobile version