డార్క్‌వెబ్‌లో విక్రయానికి 3కోట్ల రైల్వే ప్రయాణికుల డేటా

విధాత‌, న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందట ఎయిమ్స్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌ చేసినట్లు సమాచారం. ఐఆర్‌సీటీసీలో నమోదైన సుమారు 3 కోట్ల మంది ప్రయాణికుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌, చిరునామా, వయసు, జెండర్‌, ట్రావెల్‌ హిస్టరీ వంటి వివరాలను హ్యాక్‌ చేసి, డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు సమాచారం. షాడో […]

  • Publish Date - December 29, 2022 / 07:29 AM IST

విధాత‌, న్యూఢిల్లీ: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కొద్ది రోజుల కిందట ఎయిమ్స్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐఆర్‌సీటీసీ (ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) రైల్వే ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు హ్యాక్‌ చేసినట్లు సమాచారం.

ఐఆర్‌సీటీసీలో నమోదైన సుమారు 3 కోట్ల మంది ప్రయాణికుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఈ-మెయిల్‌, చిరునామా, వయసు, జెండర్‌, ట్రావెల్‌ హిస్టరీ వంటి వివరాలను హ్యాక్‌ చేసి, డార్క్‌వెబ్‌లో అమ్మకానికి ఉంచినట్లు సమాచారం. షాడో హ్యాకర్‌ అనే పేరుతో డిసెంబరు 27న ప్రయాణికుల వివరాలను హ్యాక్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే, మీడియాలో వస్తున్న వార్తలను రైల్వేశాఖ కొట్టిపారేసింది. కానీ, రైల్వే ప్రయాణికుల డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని రైల్వే బోర్డు సీఈఆర్‌టీ ఇన్‌కు హెచ్చరిక జారీ చేసింది. డేటాను విశ్లేషించిన సమయంలో డార్క్‌వెబ్‌లో డేటా లీక్‌ అయినట్లు ఓ నమూనాను గుర్తించింది.

కానీ, దాని నమూనా ఐఆర్‌సీటీసీ ఏపీఐ హిస్టరీతో సరిపోలడం లేదని, డేటా IRCTC సర్వర్ నుంచి లీక్‌ కాలేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. మరో వైపు డేటా లీకేజీపై వెంటనే పరిశోధించాలని ఐఆర్‌సీఈసీ భాగస్వామ్యులను కోరింది. ఏదైనా లీకేజీ జరిగితే వెంటనే చర్యలు చేపట్టాలని, ఈ మేరకు సమాచారం ఇవ్వాలని ఐఆర్‌సీటీసీ ఆదేశించినట్లు తెలుస్తున్నది.