Site icon vidhaatha

Washington DC | అమెరికాలో అదుపు తప్పుతున్న తుపాకులు

Washington DC

వాషింగ్టన్‌ డీసీ: అమెరికాలో గన్ కల్చర్ ఆగేటట్టు కనిపించటం లేదు. అక్కడ తుపాకి కాల్పలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి 8గంటల ప్రాంతంలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మళ్లీ తుపాకి గర్జించింది. ఈ ఘటన గుడ్ హోప్ రోడ్డులోని 1600 బ్లాక్, దక్షిణ- తూర్పు ఏరియాలో చోటుచేసుకున్నది.

ఈ ఘటనలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని స్థానిక హాస్పటల్లో చేర్పించారు. వీరి పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉన్నదని మెట్రో పాలిటన్ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జ్‌ పమేలా స్మిత్‌ తెలిపారు. ఆమె తన పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి హుటాహుటిన చేరుకొని పరిస్థితులను అదుపుచేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. హీనమైన కొందరు ఇటువంటి నీచమైన ఘటనలకు పూనుకుంటున్నారని, ప్రజలు అన్ని వేళలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ముందుగా సమాచారం అందించటం ద్వారా పోలీసులు వీటిని నివారించగలుగుతారని తెలిపారు. శనివారం కూడా దేశ రాజధాని వాయవ్య వాషింగ్‌టన్‌లోని అంటారియా బ్లాక్‌లో సమారు రాత్రి ఒంటి గంట సమయం లో మరో ఘటన జరిగింది.

ఇందులో కనీసం ఇద్దరూ చనిపోయారు. మరొక రు తీవ్రంగా గాయపడ్డారు.. ఇలా ఈ మధ్య వరుసగా 5 రోజులలో జరిగిన గన్ షూటింగ్ లో కనీసం 13 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలన్నీ వాషింగ్టన్ చుట్టుప్రక్కల ప్రాంతాలే. ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 160మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version