Site icon vidhaatha

Morocco | అటు భూకంపం.. ఇటు వరదలు.. 3000 మంది మృతి

Morocco

విధాత: ప్రకృతి వైపరీత్యాలు లిబియా, మొరాకో దేశలను వణికించాయి. వేల మంది ప్రాణాలను బలిగొన్నాయి. ఆఫ్రికన్‌ దేశం లిబియాలో డెనియల్‌ తుఫాను, వరదల విధ్వంసం 2వేల మందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. తుఫాను ధాటికి బహుళ అంతస్తుల భవనాలు అనేకం బురదలో కూరుకుపోయాయి. తూర్పు ప్రాంతం డెర్నాలో తుఫాను, వరద నష్టం అధికంగా ఉండగా, చాలి మంది నీటిలో కొట్టుకపోగా, వేలాది మంది గల్లంతయ్యారు.

మొరాకో ప్రధాని ఒసామా హమద్‌ మూడు రోజు సంతాప దినాలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వరదల కారణంగా అనేక నగరాల్లో ఇండ్లు, ఇతర ఆస్తులు ధ్వంసమవ్వగా, ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరిన్ని వర్షాలు కురిసే అవకాశముంది ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తుఫాన్‌ విధ్వంసానికి గురైన లిబియాకు సహాయక చర్యలలో భాగంగా టర్కీ దేశం మూడు విమానాలను పంపించింది.

Exit mobile version