Viral News | విమానం కుదుపులకు గురై ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు. ఈ ఘటన ఆదివారం హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చోటు చేసుకున్నది. హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫీనిక్స్ నుంచి హొనొలుకు బయలుదేరింది. విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు ముందు బలమైన గాలుల కారణంగా విమానం కుదుపులకు గురైంది. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిరిపడ్డారు.
దీంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పది మంది సిబ్బందితో పాటు సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ల్యాండయ్యే సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో సీటు బెల్టు పెట్టుకోని కారణంగా కుదుపులకు ప్రయాణికులు ఒక్కసారిగా పైకి ఎగిరి.. కింది కప్పును ఢీకొట్టి కిందపడ్డారు.
Inside #Hawaii #Flight 35 from hell: Passenger films moment plane NOSEDIVES during severe #turbulence that saw 11 people hospitalized pic.twitter.com/RqnArfV1FQ
— Hans Solo (@thandojo) December 20, 2022
ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ రంగంలోకి దిగి గాయపడ్డ వారికి వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఎమర్జెన్సీ రూమ్స్‌కి తరలించారు. ఈ ఘటనపై హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఒకరు స్పందించారు. ఇలాంటి సంఘటన ఇటీవలకాలంలో ఎన్నడూ జరుగలేదన్నారు.