Site icon vidhaatha

వెనుకంజ‌లో మంత్రులు

ఓటమి దిశగా బీఆరెస్ మంత్రులు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు తాము పోటీ చేసిన స్థానాల్లో గెలుపు బాటలో సాగుతుండగా, బీఆరెస్‌లో మెజార్టీ మంత్రులు ఓటమి దిశగా సాగుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కామారెడ్డి, కొడంగల్‌లో ఆధిక్యతలో ఉండగా, పీసీసీ మాజీ చీఫ్ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతిలు హుజూర్‌నగర్‌, కోదాడలలో , సీనియర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు నల్లగొండ, మునుగోడులలో గెలుపు దిశగా దూసుకెలుతున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినే అత్యధికంగా 44వేలకుపైగా ఓట్ల లీడ్‌లోఉన్నారు. మధిర భట్టి విక్రమార్క, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి 36వేల ఆధిక్యతలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా గెలుపు బాటలో ఉన్నారు. ఆందోల్‌లో దామోదరం రాజనరసింహ, మంధనిలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క సహా ముఖ్య నేతలు విజయానికి దగ్గరగా ఉన్నారు.


బీఆరెస్‌లో స్వయంగా సీఎం కేసీఆర్ కామారెడ్డిలో మూడో స్థానంలో ఉండగా, గజ్వేల్‌లో ఆధిక్యతలో ఉన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, తొలిసారి పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో పరాజయం దిశగా సాగుతున్నారు. పాల‌కుర్తి నుంచి పంచాయ‌తీరాజ్ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, నిర్మ‌ల్ నుంచి పోటీ చేసిన దేవాదాయ‌,అట‌వీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, ర‌వాణ శాఖ మంత్రి పువ్వాడ అజ‌య్‌లు వెనుకంజ‌లో ఉన్నారు. బీజేపీ 8చోట్ల, సీపీఐ, బీఎస్పీ ఒక్కో చోట గెలుపు వాకిట నిలిచాయి. జనసేన పోటీ చేసిన 8చోట్ల డిపాజిట్లు దక్కలేదు

Exit mobile version