Site icon vidhaatha

పాలకుర్తిలో.. ఎర్రబెల్లికి భారీ షాక్! కాంగ్రెస్‌లో చేరిన పాల‌కుర్తి నేత‌లు

విధత: వరంగల్ లో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహాల్లో మునిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao)కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. నిజానికి రజతోత్సవ సభా వేదికపై కాంగ్రెస్ నుంచి పలువురు అసంతృప్తులకు గులాబీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహం పన్నినట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ ఎస్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ చేరికల ఎపిసోడ్ కు తెరలేపింది. గురువారం పాలకుర్తికి చెందిన పలువురు బీఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు సన్నిహితుడు సోమేశ్వర్ రావు, పలువురు మాజీ సర్పంచ్ లు, జెడ్పీటీసీలు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తాజా చేరికల వ్యవహారం వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Exit mobile version