క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన 70 ఏండ్ల వృద్ధురాలు

ఆమెకు 70 ఏండ్ల వ‌య‌సు. ఆ వ‌య‌సులోనూ ఆ వృద్ధురాలు త‌ల్లైంది. క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

  • Publish Date - December 2, 2023 / 06:58 AM IST

విధాత‌: ఆమెకు 70 ఏండ్ల వ‌య‌సు. ఆ వ‌య‌సులోనూ ఆ వృద్ధురాలు త‌ల్లైంది. క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం 40 ఏండ్లు నిండిన మ‌హిళ‌లు పిల్ల‌ల్ని క‌న‌డం క‌ష్టంగా మారింది. కానీ ఈ వృద్ధురాలు 70 ఏండ్ల వ‌య‌సులో క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ అరుదైన ఘ‌ట‌న తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.


ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు ప్రస్తుతం 70 ఏళ్లు. ఐవీఎఫ్ ద్వారా ఆమె తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. కంపాలా నగరంలోని ఓ హాస్పిట‌ల్‌లో బుధవారం ఆమెకు సిజేరియన్‌ ద్వారా బాబు, పాప పుట్టారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఆమెకు క‌వ‌ల‌లు జ‌న్మించిన‌ట్లు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.


2020లోనూ సఫీనా ఐవీఎఫ్‌ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. అయితే ఆమెకు మొద‌ట 1992లో వివాహమైంది. కానీ పిల్ల‌లు పుట్ట‌లేదు. కొంత‌కాలానికి భ‌ర్త చ‌నిపోయాడు. 1996లో స‌ఫీనా న‌ముక్వాయా రెండో వివాహం చేసుకుంది.

Latest News