వాహన దారులకు కేంద్రం షాక్

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 20 ఏళ్లు పైబడిన వాహనాలపై రెన్యూవల్ ఫీజు భారీగా పెంచింది. టూ వీలర్ వాహనాలపై మునుపు రూ.1000 ఉండగా, దాన్ని ఇప్పుడు డబుల్ చేస్తూ రూ.2000లకు పెంచింది

  • Publish Date - September 14, 2025 / 05:00 PM IST

భారీగా పెరిగిన ఫిట్‌నెస్ ఛార్జీలు

విధాత: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 20 ఏళ్లు పైబడిన వాహనాలపై రెన్యూవల్ ఫీజు భారీగా పెంచింది. టూ వీలర్ వాహనాలపై మునుపు రూ.1000 ఉండగా, దాన్ని ఇప్పుడు డబుల్ చేస్తూ రూ.2000లకు పెంచింది. కార్ల విషయంలో గతంలో రూ. 5000 ఉండగా ఇప్పడు రూ. 10000 చేసింది. అలాగే ఇంపోర్టెడ్ వాహనాల విషయంలో రూ. 40000 నుంచి రూ. 80000 చేసింది. అయితే ఈ నియమం 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య ఉన్న వాహనాలకు చెల్లించదు. 20 ఏళ్లు దాటిన వాహనాలకే వర్తిస్తున్నట్లు వెల్లడించింది. పాత వాహనాల వినియోగాన్ని తగ్గించడం కోసం ఈ మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.