Site icon vidhaatha

Rakhi | ఒకరికే 7 వేల రాఖీలు క‌ట్టిన అమ్మాయిలు.. ఆ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

Rakhi |

విధాత‌: మ‌నకు దారి చూపే ఉపాధ్యాయుడిని మించిన సోద‌రుడు ఎవ‌రుంటారని భావించారో ఏమో.. ఆన్‌లైన్ ట్యూట‌ర్‌గా ప్ర‌సిద్ధి చెందిన ఓ వ్య‌క్తికి ఏకంగా 7 వేల రాఖీలు క‌ట్టేసి విద్యార్థులు త‌మ ప్రేమ‌ను చూపించారు. పాట్నాకు చెందిన ఖాన్.. ఆన్‌లైన్ ప్ర‌పంచంలో ఖాన్ స‌ర్ (Khan Sir) గా సుప‌రిచితుడు. రాఖీ (Rakhi) పూర్ణిమ సంద‌ర్భంగా త‌న కార్యాల‌యంలో వేడుక చేసుకుందామ‌ని విద్యార్థుల‌కు ఆహ్వానం ప‌లికారు.

దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులు ఆయ‌న కార్యాల‌యానికి చేరుకున్నారు. అంతే కాకుండా వారిలో ఉన్న 7 వేల మంది అమ్మాయిలు ఆయ‌న‌కు రాఖీ క‌ట్టేశారు. దీంతో ఎక్కువ మంది చేత రాఖీ క‌ట్టించుకున్న వ్య‌క్తి బహుశా తానేన‌ని ఇదో రికార్డ‌ని ఖాన్ స‌ర్ పొంగి పోయారు.

ఇంకా కొంత మంది క‌డ‌దాం అనుకున్న‌ప్ప‌టికీ.. తాకిడి బాగా ఉండ‌టంతో కుద‌ర‌లేద‌ని వాపోయారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌తి అమ్మాయి ద‌గ్గ‌ర‌కు ఖాన్ వెళ్లి రాఖీ క‌ట్టించుకున్నారు. ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌వ‌డానికి ఏకంగా రెండున్న‌ర గంట‌లు ప‌ట్ట‌డం విశేషం. త‌న‌కు చెల్లెలు లేద‌ని.. అందుకే ప్ర‌తి విద్యార్థిని చెల్లెలిగా భావిస్తాన‌ని ఖాన్ చెప్పుకొచ్చారు.

ప్ర‌తి ఏడ‌దీ త‌న‌కు వేల రాఖీలొస్తాయ‌ని.. ఈ ఏడాది నేరుగా వచ్చి క‌ట్టార‌ని పేర్కొన్నారు. ఇప్ప‌డు రాఖీ క‌ట్టిన వారిలో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన వారే.. వారు త‌మ కుటుంబాన్ని వ‌దిలేసి ఇక్క‌డ చ‌దువుకోవ‌డానికి వ‌చ్చారు. వారికి అన్న‌య్యలా ఉండి మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్య‌త నాపై ఉంది అని ఖాన్ పేర్కొన్నారు. ఆ 7 వేల రాఖీల బ‌రువుకు ఆయ‌న త‌న చేయి ఎత్తలేక‌పోతుండ‌టం గ‌మ‌నార్హం.

Exit mobile version