Site icon vidhaatha

తెలంగాణ ఎమ్మెల్యేల్లో 72 మంది గ్రాడ్యుయేట్లు..

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల‌కు సంబంధించిన ప‌లు వివ‌రాల‌ను ఏడీఆర్ వెల్ల‌డించింది. ఇందులో ప్ర‌ధానంగా కోటీశ్వ‌రులు ఎంత మంది..? క్రిమిన‌ల్ కేసులు ఎంత మంది..? ఎమ్మెల్యేల‌పై ఉన్నాయనే వివ‌రాల‌ను బహిర్గ‌తం చేసింది. ఈ రెండింటితో పాటు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఏం చదువుకున్నారో వంటి వివ‌రాల‌ను కూడా తెలిపింది ఏడీఆర్.


119 మంది ఎమ్మెల్యేల్లో 114 మంది కోటీశ్వ‌రులు కాగా, 82 మందిపై క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపింది. ఇక 119 మందిలో 72 మంది డిగ్రీ, ఆపై చ‌దువులు చ‌దివిన వారు ఉన్నారు. 40 మంది ఐదు నుంచి 12వ త‌ర‌గ‌తి దాకా చ‌దివిన వారు ఉన్నారు. ఐదుగురేమో డిప్లొమా హోల్డ‌ర్స్ కాగా, ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు చ‌ద‌వ‌డం మాత్ర‌మేవ‌చ్చు.


25 నుంచి 50 ఏండ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారు 23 మంది ఉండ‌గా, 51 నుంచి 80 ఏండ్ల వ‌య‌సున్న వారు 96 మంది ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది మహిళ‌లు ఉన్నారు. 2018లో వీరి సంఖ్య కేవ‌లం ఆరు మాత్ర‌మే.

Exit mobile version