యాదాద్రిలో 7.7 కోట్లతో.. హరిత హోటల్ ఆధునీకరణ

  • Publish Date - September 24, 2023 / 11:54 AM IST

విధాత: దేశంలోని అద్భుత శిల్పకళతో నిర్మితమైన ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధిలో మరిన్ని నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. వాటికి తోడుగా కొండపైన ఉన్నటూరిజం కార్పోరేషన్‌కు చెందిన హరిత హోటల్‌ను 7.70కోట్లతో ఆధునీకరించనున్నారు. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ నిధులతో ఆధునీకరణ పనులకు టెండర్లు ఆహ్వానించారు.

 త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. కొండపైన ఉన్న ప్రస్తుత హరిత హోటల్‌లో 32 గదులు, రెండు సూట్లు ఉన్నాయి. వీటీని ఆధునీకరించడంతో పాటు భశనం చుట్టు గార్డెనింగ్‌, పార్కింగ్‌, అల్పాహారం, భోజన వసతుల గదుల నిర్మాణాలను ఆలయ ఆధ్యాత్మికతకు అనుగుణంగా నిర్మించనున్నారు.