Site icon vidhaatha

Eight People Riding On A Single Bike: ఒకే బైక్ పై 8 మంది ప్రయాణిస్తూ స్టంట్స్ ..కట్ చేస్తే!

విధాత, హైదరాబాద్ : యువత రీల్స్..సెల్ఫీలు..బైక్ రేసింగ్ స్టంట్ల వేలం వెర్రిలో పడి ప్రమాదాలకు..నేరాలకు పాల్పడుతున్న తీరు ఆందోళన కరంగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకులు ప్రమాదకర రీతిగా ప్రయాణిస్తూ స్టంట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఒక బైక్ పై ప్రమాదకరంగా ఎనిమిది మంది కూర్చుని రహదారిపై చేసిన స్టంట్లు చేస్తుండగా.. కొందరు వాహనదారులు వెనుక నుంచి వీడియో తీశారు.

యువకుల దుస్సాహసంపై ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ రాజేందర్ గౌడ్ ప్రమాదకర బైక్ స్టంట్స్ చేసిన 8 మంది యువకులను అదుపులకు తీసుకున్నారు. వారిలో కొంత మంది మైనర్ లు ఉన్నట్లుగా సీఐ తెలిపారు. ఈ రకమైన దుస్సాహాసాలతో రోడ్లపై స్టంట్లు, రీల్స్ చేసి సాటి ప్రయాణికులకు ఇబ్బందికల్గించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు.

Exit mobile version