Site icon vidhaatha

Elephant | నగరంలోకి మాట్లాడే ఏనుగు ఏలీ.. ఆసక్తి చూపుతున్న విద్యార్థులు

రాజేంద్రనగర్ గ్లెండెల్ స్కూల్ వేదికగా ఆవిష్కరణ

Elephant | మాట్లాడే ఏనుగు హైదరాబాద్ నగరానికి విచ్చేసింది. రాజేంద్రనగర్‌లోని గ్లెండేల్ స్కూల్‌లో మాట్లాడే ఏనుగు ఎలీని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. పెటా ఇండియా తయారు చేసిన మాట్లాడే ఏనుగుకు ఎలీ అని పేరు పెట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆవిష్కృతమైన మాట్లాడే ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పెద్దలతో పాటు పిల్లలకు జంతువుల పట్ల అవగాహాన కల్పించేందుకు ఎలీతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా పెటా సభ్యులు తెలిపారు. అయితే పిల్లలు ఇంకేందుకు ఆలస్యం… మీరు ఏనుగుతో మాట్లాడతారా? అయితే, ఎలీని కలవాల్సిందేనంటూ పెటా సభ్యులు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడే ఏనుగు ఎలీ ఆవిష్కరణ వీడియోలు వైరల్‌గా మారాయి.

Exit mobile version