విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్(Hyderabad Drugs) వ్యవహారం వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పరిధిలో మోతాదుకు మించి డ్రగ్స్(Drug Overdose)సేవించిన అలీ(28) అనే వ్యక్తి మృతి (Dead) చెందాడు. మరో యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. మృతుడు మొబైల్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడని సమాచారం. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ నంబర్ 805లో అహ్మద్ అలీ, అతని స్నేహితుడు మరో ఇద్దరు యువతులతో కలిసి లివింగ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నారు. బుధవారం రాత్రి అహ్మది అలీ, అతని స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. పార్టీ తర్వాత అహ్మద్ అలీ అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. డ్రగ్స్ సేవించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సులో మాదకద్రవ్యాలను తీసుకొస్తుండగా ముగ్గురిని పట్టుకున్నారు. మరో ముగ్గురు వినియోగదారులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ముషిరాబాద్ లో డ్రగ్స్ దందాలో డాక్టర్ జాన్ పాల్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదే రోజున గచ్చిబౌలీలో ఓ రూమ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీపై దాడి చేసి 13మంందిని అరెస్టు చేశారు.
