Site icon vidhaatha

Hanamkonda | స్కూల్ వ్యాన్ ఢీకొని బాలుడు మృతి

Hanamkonda | విధాత, వరంగల్: స్కూల్‌ వ్యాన్‌ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో మంగళవారం జరిగింది. భీమదేవరపల్లి మండలం చంటయ్యపల్లికి చెందిన దండవేన శరత్, మమత దంపతుల పెద్ద కుమారుడు సాన్విక్ (చెర్రీ) గట్లనర్సింగాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. రోజు సాన్విక్ స్కూలుకు వ్యాన్‌లో వెళుతున్నాడు.

కాగా.. రోజు లాగానే తల్లి మంగళవారం తన కొడుకును స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుండగా చిన్న కుమారుడు శివాన్ష్(3) వెంట వచ్చాడు. శివాన్స్​ బస్సు ఎదురుగా పరిగెత్తాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించడంతో ముందు టైర్ కింద పడిన శివాన్ష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కళ్ళ ముందే కొడుకు విగత జీవునిగా మారాడు.డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version