Viral Video | చీరలో జిమ్‌ వర్కవుట్స్‌ చేస్తున్న మహిళ..!

Viral Video | చీర ధరించి ఓ మహిళ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రీనా సింగ్‌ ఫిట్‌నెస్‌ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో నెటిజన్లను ఫిదా చేస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు పదిలక్షల వరకు లైక్స్‌ రాగా.. 33 మిలియన్లకు పైగా వీక్షించారు. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) ఈ వీడియోకు ‘ఇది ప్రారంభం మాత్రమే’ అంటూ శీర్షికను […]

  • Publish Date - January 8, 2023 / 04:59 PM IST

Viral Video | చీర ధరించి ఓ మహిళ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రీనా సింగ్‌ ఫిట్‌నెస్‌ యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో నెటిజన్లను ఫిదా చేస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు పదిలక్షల వరకు లైక్స్‌ రాగా.. 33 మిలియన్లకు పైగా వీక్షించారు.

ఈ వీడియోకు ‘ఇది ప్రారంభం మాత్రమే’ అంటూ శీర్షికను జోడించారు. వీడియోలో రీనాసింగ్‌ చీరలోనే లుంజెస్, లాట్ పుల్‌డౌన్‌ తదితర వర్కవుట్‌ చేసింది. భారీ టైర్‌ను ఎత్తడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రీనాసింగ్‌ వస్త్రధారణను ప్రశంసించగా.. మరికొందరు మహిళలు జిమ్‌లో వ్యాయామం చేయడానికి ప్రత్యేకమైన దుస్తులు ధరించడానికి బదులుగా చీరను ధరించడం సరైందేనా? అంటూ ప్రశ్నించారు.

ఓ యూజర్‌ స్పందిస్తూ చీరను ధరించండి కానీ.. బరువులు, క్రాస్‌ ఫిట్‌, యంత్రాలతో జిమ్‌ చేసే సమయంలో సౌకర్యవంతమైన జిమ్‌ దుస్తులు కావాలని, సురక్షితంగా ఉండండి’ అంటూ సూచించాడు. జిమ్‌ చేసే సమయంలో గాయాల పాలు కాకుండా ఉండేందుకు సరైన దుస్తులు ధరించేలా ప్రోత్సహించాలని మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు.

ఇలాంటి వీడియోలను ప్రమోట్ చేయొద్దని, ఇలాంటి వాటిని చూసి ప్రజలు అనుకరించి.. అలాంటి దుస్తులు ధరించేందుకు ప్రయత్నిస్తే.. అది ప్రమాదకరం అంటూ మరో యూజర్‌ స్పందించాడు.

ఇంతకు ముందు చైన్నైకి చెందిన 56 మహిళ సైతం వర్కవుట్స్‌ చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఈ వీడియోను హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్‌బెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. చీర ధరించి మహిళ భారీ బరువులు, డంబెల్స్‌తో పాటు అనేక ఇతర మిషన్లను ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది.