Sircilla
విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యువకుడు పడిగేలా నరేష్ (25) ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. మృతుడు పది రోజుల కిందటే గల్ఫ్ నుంచి వచ్చినట్లు తెలిసింది.
కాగా.. హత్యకు అక్రమ సంబంధమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. నరేష్ ఇంటి వెనకే ఉంటున్న ఓ మహిళ ఇంట్లో ఘటన జరగడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురైన నరేష్ ఇంటి యజమానురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటనకు కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సీఐ కిరణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు