విధాత : దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ టి20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులకు సాధించింది.. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ 127 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది. భారత స్పిన్నర్ల ధాటికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఒక పరుగుకే తొలి వికెట్ కోల్పోయిన పాకిస్తాన్ ఆద్యంతం వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్లలో అత్యధికంగా ఫర్విన్ 40(44) పరుగులు సాధించాడు. చివర్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది 33(16) పరుగులు సాధించడంతో పాకిస్తాన్ ఈ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర పటేల్ 2 వికెట్లు, బూమ్రా 2 వికెట్లు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలోవికెట్టు సాధించారు.
IND Vs PAK: భారత్ టార్గెట్ 127
దుబాయ్ వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఆసియా కప్ టి20 లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 127 పరుగులకు సాధించింది.. ఈ మ్యాచ్ లో గెలవాలంటే భారత్ 127 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సి ఉంది

Latest News
ఈ వారం ఓటీటీలో.. : చిత్రాలు – సిరీస్‌లు(డిసెంబర్ 01–07)
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
పాతికేళ్లలో తొమ్మిది ఎయిర్ లైన్స్ కనుమరుగు.. ఇండిగో నెక్ట్స్?
రెఫరెండమన్నడికి సిగ్గు లేదు.. మళ్ల నోరేసుకుని తిరుగుతుండు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్
హిల్ట్ పాలసీపై హైకోర్టులో పిటిషన్
అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు.. వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్
అప్పటి పరిస్థితుల వల్లే పవన్ కల్యాణ్ పై విమర్శలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఖర్చు రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు
ఐబొమ్మ రవికి మరో మూడు రోజుల కస్టడీ