విధాత: అఫ్ఘనిస్థాన్‌లో చరిత్ర పునరావృతమవుతున్నది. 1990లనాటి తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. చిన్న నేరాలు, సామాజిక నైతిక కోడ్ ఉల్లంఘించారన్న నేరాలకు బహిరంగ శిక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలందరు చూస్తుండగా బహిరంగ ప్రదేశాల్లో కొరడా దెబ్బలు కొట్టడం, చేతులు నరికివేత లాంటి కౄర శిక్షలు అమలు చేస్తున్నారు.
ఈ మధ్యనే అఫ్ఘానిస్థాన్‌లోని అహ్మద్ షామి స్టేడియాలో 9 మందికి తాలిబన్లు బహిరంగ శిక్షలు అమలు చేశారు. చిన్న చిన్న నేరాలు, నైతిక, సామాజిక చట్టవిరుద్ధ నేరాలు చేశారన్న అభియోగంతో ఒక్కొక్కరికి 35 నుంచి 39 కొరడా దెబ్బలతో శిక్షించారు.
This is not football match, this is Kabul Afghanistan, where people are enjoying #Taliban’s punishing some criminals, instead of wasting their time here, they could earn some money for their children?#TalibanTerrorists #StopHazaraGenocide #FreeAfghanistan #FreeAfghanistanWomen pic.twitter.com/EtNmlwurbF
— Ali Reza Karimi (@Karimi_Balkhabi) January 17, 2023
ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వంలో అఫ్ఘన్ సలహాదారుగా పనిచేసిన షబ్నమ్ నాసిమి మరో భయానక విషయం తెలియజేశారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. కాందహార్ ఫుట్‌బాల్ స్టేడియంలో దొంగతనం చేశారన్న ఆరోపణలతో నలుగరి చేతులు నరికి వేశారు.
దీనికి సంబంధించి ఎలాంటి సూత్రబద్ధమైన విచారణ కొనసాగించలేదు. సాక్ష్యాలు చూపెట్టలేదు. కేవలం ఆరోపణల పునాదులపై అమానవీయ శిక్షలు తాలిబన్లు అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ సమాజం, హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంఘాలు తాలబన్ల విధానాన్ని ఎంత వ్యతిరేకిస్తున్నా వారు మాత్రం తమ పాత విధానాలను మార్చుకోవటం లేదని షబ్నమ్ నాసిమి ఆవేదన వ్యక్తం చేశారు.
The Taliban have reportedly cut off the hands of 4 people in a football stadium in Kandahar today, accused of theft, in front of spectators.
People are being lashed, amputated & executed in Afghanistan, without fair trial and due process.
This is a human rights violation. pic.twitter.com/vLcjCOTOM5
— Shabnam Nasimi (@NasimiShabnam) January 17, 2023